అంధకారంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:13 PM
నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న అంధకారంతో రోగులు అవస్థలు పడ్డారు.
- ఎమర్జెన్సీ వార్డులో సెల్‌ఫోన్ వెలుతురులో వైద్య సేవలు
- ఉక్కపోతతో రోగుల నరకయాతన
- జనరేటర్ ప్రారంభించని వైద్య సిబ్బంది
నారాయణపేట న్యూటౌన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న అంధకారంతో రోగులు అవస్థలు పడ్డారు. ఈదురుగాలుల బీభత్సంతో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 8 గంటలు దాటినా విద్యుత్ పునరుద్ధరణ కాకపోవడంతో అత్యవసర వార్డులో సెల్‌ఫోన్ వెలుతురులో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఓవైపు అంధకారం, మరోవైపు ఉక్కపోతతో రోగులు నరకయాతన అనుభవించారు. కనీసం జనరేటర్ సైతం ప్రారంభించకపోవడంతో వైద్య సిబ్బంది తీరును రోగులు తప్పుపట్టారు. రోగుల నరకయాతన ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు.