Share News

కిక్‌బాక్సింగ్‌ సిటీ లీగ్‌ టోర్నీలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:24 PM

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ కిక్‌బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అస్మిత-ఖేలో ఇండియా ఉమెన్స్‌ కిక్‌బాక్సింగ్‌ సిటీ లీగ్‌ పోటీలు ముగిశాయి.

 కిక్‌బాక్సింగ్‌ సిటీ లీగ్‌ టోర్నీలో   జిల్లా క్రీడాకారుల ప్రతిభ
ఖేలో ఇండియా ఉమెన్స్‌ కిక్‌బాక్సింగ్‌ సిటీ లీగ్‌లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు

- మహబూబ్‌నగర్‌ జిల్లాకు 57 పతకాలు

- నాగర్‌కర్నూల్‌కు 16, వనపర్తికి 13..

మహబూబ్‌నగర్‌స్పోర్ట్స్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ కిక్‌బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అస్మిత-ఖేలో ఇండియా ఉమెన్స్‌ కిక్‌బాక్సింగ్‌ సిటీ లీగ్‌ పోటీలు ముగిశాయి. ఆదివారం రాత్రి వరకు పోటీలు జరిగాయి. టోర్నీలో మహబూబ్‌నగర్‌ జిల్లా 57, నాగర్‌కర్నూల్‌ 16, వనపర్తి జిల్లాకు 13 పతకాలు వచ్చాయి. విజేతలకు కిక్‌ బాక్సింగ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామాంజనేయులు, మహిపాల్‌ పతకాలు అందజేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్‌, రవినాయక్‌, కోచ్‌లు, రెఫరీలు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 11:24 PM