Share News

14 ప్లాంట్ల ద్వారా శుద్ధ జలాల పంపిణీ

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:21 PM

మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని 14 తాగునీటి ప్లాంట్ల ద్వారా శుద్ధ జలాలను 2,639 గ్రామాలకు సరఫరా చేస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ ఈ హచ్‌ జగన్‌ మోహన్‌ తెలిపారు. ఎక్కడైనా లీకేజీలు, ఇతర సమస్యలు ఉం టే పరిష్కారానికి, ప్లాంట్లు, ట్యాంకులు శుద్ధీకరించేందుకు సర్కిల్‌ పరిధిలోని మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్లకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.

14 ప్లాంట్ల ద్వారా శుద్ధ జలాల పంపిణీ
‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ జగన్‌మోహన్‌

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ జగన్‌ మోహన్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని 14 తాగునీటి ప్లాంట్ల ద్వారా శుద్ధ జలాలను 2,639 గ్రామాలకు సరఫరా చేస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ ఈ హచ్‌ జగన్‌ మోహన్‌ తెలిపారు. ఎక్కడైనా లీకేజీలు, ఇతర సమస్యలు ఉం టే పరిష్కారానికి, ప్లాంట్లు, ట్యాంకులు శుద్ధీకరించేందుకు సర్కిల్‌ పరిధిలోని మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్లకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆదివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు..

ఎన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు?

మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల పరిధిలో 14 నీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. వాటి ద్వారా 2,639 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నాం.

నీటిని ఎలా శుద్ధి చేస్తారు?

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ద్వారా తీసుకునే రా నీటిలో ఎలాంటి కలుషితాలు ఉం డవు. దాదాపు స్వచ్ఛతతోనే ఉంటాయి. భూగర్భ జలాల్లో మాత్రం నీటి కాలుష్యం అధికంగా ఉంటుంది. ఆ నీటిని డబ్య్లూహెచ్‌వో(వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) సూచనల మేరకు ఫ్లోరైడ్‌ తదితర పరీక్షలు నిర్వహించి, శుద్ధి చేస్తున్నాం.

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏమైనా నిధులు ఇచ్చిందా?

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం సర్కిల్‌ పరిధిలోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాలకు ఒక్కో దానికి రూ.కోటి చొప్పున కలెక్టర్లకు విడుదల చేసింది. అయితే వేసవిలో నీటి ఎద్దడి లేనందున ఆ నిధులను ఇప్పుడు వాడుకోనున్నారు. వాటర్‌ ప్లాంట్ల శుద్ధీకరణ, మరమ్మతులు ఉంటే ఆ నిధులతో చేపట్టనున్నారు.

రోజూ ఒక మనిషికి ఎన్ని లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు?

గ్రామీణ ప్రాంతంలో ఒక మనిషికి రోజు 100 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. అదే అర్బన్‌లో అయితే 130 లీటర్లు, మునిసిపాలిటీలో 150 లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నాం.

సర్కిల్‌లో రోజూ ఎన్ని లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు?

మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో రోజూ 267 ఎంఎల్‌డీ(మిలియన్‌ లీటర్లు డైలీ)ల నీటిని సరఫరా చేస్తున్నాం. అం దులో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 113 ఎంఎల్‌డీలు, నారాయణపేటలో జిల్లాలో 57, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 95 ఎంఎల్‌డీల నీటిని అందిస్తున్నాం.

లీకేజీలను ఎలా పరిష్కరి స్తున్నారు?

పైప్‌లైన్‌ లీకేజీలను గ్రామ పంచాయతీల పరిధిలో ప్రత్యేక అధికారులు చేపడుతుండగా, గ్రిడ్‌లో మాత్రం ఏజెన్సీ వారు లీకేజీలు, ఇతర మరమ్మతులు వారి కాలపరిమితి పూర్తయ్యే వరకు నిర్వహిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఎలా ఉంది?

ప్రతీ వాటర్‌ ప్లాంట్‌ను వారి పరిధిలోని డీఈలు, ఏఈలు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైన చిన్న సమస్య వచ్చినా ఇంట్రా, గ్రిడ్‌ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:21 PM