శిథిలావస్థకు చేరిన.. గ్రామ పంచాయతీ భవనాలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:30 PM
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గ్రామ పంచాయతీల్లో పాత జీపీ భవనాల స్థానాల్లో అన్ని హంగులతో నూతన భవనాలు ఏర్పాటు చేస్తున్నారు.
గండీడ్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గ్రామ పంచాయతీల్లో పాత జీపీ భవనాల స్థానాల్లో అన్ని హంగులతో నూతన భవనాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మండలంలోని జానంపల్లి గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకోగా, నూతన భవన నిర్మాణానికి నోచుకోలేదు. అదే విధంగా సల్కర్ పేట్ గ్రామ పంచాయతీకి స్థలం ఉండగా, నూ తన భవనం మంజూరైనప్పటికీ నిర్మాణం ఆగి పోయింది. రెండు గ్రామల్లో గ్రామ పంచాయతీ స్థలం కొంత భాగం ఎన్‌హెచ్ 167 రోడ్డు వెడ ల్పులో పోగా, ఉన్న భవనంలో కూడా సరైన వ సతులు లేక పంచాయతీ సిబ్బంది నానా ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పై క ప్పు నుంచి నీరు కురవడంతో పాటు స్టోర్‌రూం కు ఉన్న మూతకు చెదలు పట్టి చెక్కలు ఊడి పోయే స్థితిలో ఉన్నాయి. ఉన్న వస్తువులకు సైతం రక్షణ లేకుండా పోయిందని గ్రామ కార్య దర్శితో పాటు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేసి, ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
అధికారులకు నివేదికలు పంపాం..
నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మా ణం కోసం అధికారులకు నివేదిక ఇవ్వడం జ రిగింది. నిధులు వచ్చిన కూడా స్థలం లేక పోవడంతో భవనం నిర్మాణం కాలేదని, దాత లు ముందుకొచ్చి స్థలం ఇస్తే భవనం నిర్మా ణ అవుతోందన్నారు. జానంపల్లి గ్రామానికి మరో అనుబంధ గ్రామం గొల్లగడ్డ ఉంది. 774 ఓటర్లు ఉండగా, సుమారు 1500 పైగా జనాభా ఉంది.
- ఫాతీమా, గ్రామ కార్యదర్శి