Share News

ఆహార నియమాలు పాటించాలి

ABN , Publish Date - May 22 , 2025 | 11:05 PM

ఆహార నియమాలు పాటించి అసంక్రమిత రోగాలను దరి చేరకుండా చర్యలు తీసుకుంటు అనునిత్యం యోగా సాధన చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ జయచంద్రమోహన్‌ అన్నారు.

ఆహార నియమాలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయచంద్రమోహన్‌

- ఎన్‌సీడీ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయచంద్రమోహన్‌

- అసంక్రమిత వ్యాధులపై వైద్య సిబ్బందికి అవగాహన

నారాయణపేట, మే 22 (ఆంధ్రజ్యోతి): ఆహార నియమాలు పాటించి అసంక్రమిత రోగాలను దరి చేరకుండా చర్యలు తీసుకుంటు అనునిత్యం యోగా సాధన చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ జయచంద్రమోహన్‌ అన్నారు. గురువారం నారాయణపేట మండలం అప్పక్‌పల్లి మెడికల్‌ కాలేజీలో జిల్లాలోని ప్రాథమిక విద్య వైద్యాధికారులు, మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు, నర్సింగ్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లకు ఒకరోజు ఎస్‌సీడీ(అసంక్రమిత వ్యాధులు) కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్నుద్ధేశించి ఆయన మాట్లాడారు. అసంక్రమిత వ్యాధులు జీవన శైలి మార్పు వల్ల, ఆహార నియమాల్లో మార్పుల వల్ల సంభవిస్తాయన్నారు. ఆహార నియమాలు పాటించి జీవన శైలిలో మార్పు రావాలని, 30 ఏళ్లు పైబడిన వారు ప్ర తీరోజు అరగంట పాటు యోగా సాధన చేయాలన్నారు. ఎన్‌సీడీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ అబ్దుల్‌వాసే మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులు, హైబీపీ, డయాబెటిస్‌, ఓరల్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, సర్వేకల్‌ క్యాన్సర్‌ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శైలజ, సత్యప్రకాష్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, అశోక్‌కుమార్‌ తదితరులున్నారు.

Updated Date - May 22 , 2025 | 11:05 PM