ధన్‌ధాన్య కృషి యోజన రైతులకు వరం
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:18 PM
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం గా కేంద్రం ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ‘ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ (పీఎండీడీకేవై) సాగుదారులకు వరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు
గద్వాల టౌన్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం గా కేంద్రం ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ‘ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ (పీఎండీడీకేవై) సాగుదారులకు వరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. పథకంలో ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట వెనుకబడిన జిల్లాలను చేర్చడం హర్షదాయకమన్నారు. నూతన పథకాన్ని స్వాగతిస్తూ ఆదివారం పట్టణంలోని పాతబస్టాండ్ సర్కిల్‌లో ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన రామాంజనేయులు, కొత్త పథకంలో ఉమ్మడి జిల్లాకు అవకాశం కల్పించడంలో మహబూబ్‌నగర్ లోకసభ సభ్యురాలు డీకే అరుణ చేసిన కృషి కారణమని కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ఆధారంగా రైతులు పాడి, పవువులు, గొ ర్రెలు, కోళ్ల పెంపంకం వంటి సాగు అనుబంధ రంగాలపై దృష్టిసారించి అధిక ఆదాయాన్ని దక్కించుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమం లో బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, శ్యాంరావు, మీర్జాపురం రామచంద్రా రెడ్డి, బలి గెర శివారెడ్డి, రజక జయశ్రీ, వెంకటేశ్వర్ రెడ్డి, దేవదాస్, గాంజ సాయి, తిమ్మన్న, వివిధ మం డలాల నాయకులు నాగరాజు, నరేష్‌గౌడ్, బాలేశ్వర్‌రెడ్డి, అశోక్ రెడ్డి, జయరాములు, నర సింహులు, పాపిరెడ్డి, దేవేందర్ రెడ్డి, బుచ్చన్న, వెంకటస్వామి, బాబు ఉన్నారు.