Share News

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి - సమాన ప్రాతినిధ్యం

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:50 PM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యం లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అ లంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమా ర్‌ అన్నారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి - సమాన ప్రాతినిధ్యం
ప్రజలకు అభివాదం చేస్తున్న సంపత్‌కుమార్‌

- అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌

- కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

అయిజ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యం లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అ లంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమా ర్‌ అన్నారు. శుక్రవారం అయిజ నుంచి మాజీ సింగిల్‌విండో ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ చిన్న హన్మంతు, మాజీ ఎంపీ టీసీలు, మాజీ సర్పంచులుతో కలిసి పెద్ద ఎత్తు న పార్టీలో చేరారు. ఈసందర్బంగా సాయంత్రం పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం నుంచి సంపత్‌కుమార్‌తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేశా రు. అక్కడే సంపత్‌కుమార్‌ను గజమాలతో స త్కరించారు. అక్కడ నుంచి పోలీస్‌ స్టేషన్‌ ఎ దురుగా ఉన్న పార్టీ కార్యాలయం చేరుకుని భా రీ సభ నిర్వహించారు. ఈసందర్బంగా బీఆర్‌ ఎస్‌ నాయకులకు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్‌లో అందరికీ సమాన ప్రాతినిధ్యం, పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసేవారికి సముచిత స్థానం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో భూమ్‌పూర్‌ నర్సింహారెడ్డి, షెక్షావలిఆచారి, అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొడ్డప్ప, తనగల సీతారామిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 11:50 PM