Share News

గద్వాలలో నిలిచిన అభివృద్ధి

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:01 AM

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనలో గద్వా ల అభివృద్ధి ఇరవైఏళ్లు వె నక్కి వెళ్లింది.

గద్వాలలో నిలిచిన అభివృద్ధి
మాట్లాడుతున్న పాలమూరు ఎంపీ డీకే అరుణ

- నామీద కోపంతో నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో కలిపారు

- మళ్లీ మహబూబ్‌నగర్‌లో కలుపుతాం

- తపస్‌ గురువందనం కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ

గద్వాల, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనలో గద్వా ల అభివృద్ధి ఇరవైఏళ్లు వె నక్కి వెళ్లింది. తాను చేసి న అభివృద్ధి తప్ప ఇప్పుడేమీ కనిపించడం లేదని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివా రం గద్వాల పట్టణంలో ఏర్పాటు చేసిన తపస్‌ గురువందనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గద్వాల అభివృద్ధికి కేరాఫ్‌ గా ఉండేంది. ఇప్పుడు ఎక్కడ చూసినా గుంతలమయం అయిన రోడ్లే దర్శనం ఇ స్తున్నాయి అని అన్నారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా, పార్టీ బాధ్యతల వలన గద్వాలకు దూరం అయ్యానని తెలిపారు. ఇక నుంచి 15రోజులకోసారి గద్వాలకు వస్తానని, ఇక్క డ ఆగిపోయిన అభివృద్ధిని పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌లో ఉండే గద్వాలను ఓ పెద్ద నాయ కుడు నామీద కోపంతో నాగర్‌కర్నూల్‌ ఎంపీ నియోజకవర్గంలో కలిపారన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనలో మళ్లీ మహబూబ్‌నగర్‌లో కలిపేస్తానని హామీ ఇచ్చారు. గురువులు సమాజం లో మార్గనిర్దేశకులని సమాజాన్ని సన్మార్గం లో నడిపించి విద్యను విజ్ఞానాన్ని నేర్పించి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో తపస్‌ పనితీరు భేష్‌గా ఉందని కితాబిచ్చారు. ఇద్ద రు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను ఎన్నుకునే శక్తి తపస్‌కు ఉందని అన్నారు. కార్యక్రమంలో తపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతురావు, జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:01 AM