Share News

‘ధన్‌-ధాన్య’ ద్వారా మూడు జిల్లాల అభివృద్ధి

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:21 PM

కేంద్ర ప్రభుత్వం దేశంలో వె నుకబడిన వంద జిల్లాల్లో ధన్‌-ధాన్య కృషి యోజన పథకం ఇటీవలే ప్రవేశపెట్టగా, అందులో నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల జిల్లాలను ఎంపిక చే సిందని మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రే య అన్నారు.

 ‘ధన్‌-ధాన్య’ ద్వారా మూడు జిల్లాల అభివృద్ధి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

- మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

నారాయణపేట న్యూటౌన్‌, అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం దేశంలో వె నుకబడిన వంద జిల్లాల్లో ధన్‌-ధాన్య కృషి యోజన పథకం ఇటీవలే ప్రవేశపెట్టగా, అందులో నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల జిల్లాలను ఎంపిక చే సిందని మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రే య అన్నారు. ఈ జిల్లాలు వ్యవసాయ రం గంలో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నా రు. శనివారం బీజేపీ రాష్ట్ర నాయకుడు కె.ర తంగ పాండురెడ్డి షష్టిపూర్తి కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక అ తిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ ప్రజల కు దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించి పేదవారి జీవితా ల్లో వెలుగులు నింపింద న్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్‌ తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పార్లమెంట్‌లో చట్టం చే స్తేనే రిజర్వేషన్లు అమ ల వుతాయన్నారు. ఈ చ ట్టం చేయడానికి దేశం లోని అన్ని పార్టీలు మద్ధతు తెలుపాలని కోరారు. అనంతరం పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూరావు నామాజీ మాట్లాడుతూ దత్తాత్రే య ఎల్లవేళలా నారా యణపేట జిల్లా ప్ర జలకు, నాయకులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని గు ర్తుచేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.సత్యయాదవ్‌, సీనియర్‌ నాయకులు కొండయ్య తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:21 PM