తెలంగాణలో విప్లవంలా అభివృద్ధి
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:12 PM
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్ర జా ప్రభుత్వంలో విప్లవంలా అ భివృద్ధి జరుగుతున్నదని నాగర్‌క ర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు.
- నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి
కల్వకుర్తి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్ర జా ప్రభుత్వంలో విప్లవంలా అ భివృద్ధి జరుగుతున్నదని నాగర్‌క ర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆ యన పేర్కొన్నారు. కల్వకుర్తి మండలం జంగా రెడ్డిపల్లి గ్రామంలో జేపీ నగర్ నుంచి వయా తిమ్మారాసిపల్లి జేపీనగర్ టు పోల్కంపల్లి వ యా జంగారెడ్డిపల్లి తిమ్మరాసిపల్లి వరకు రూ. 25 కోట్ల 60లక్షలతో నిర్మించే డబుల్ రోడ్డు ని ర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ మల్లురవి శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా జంగిరెడ్డిప ల్లిలో జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడు తూ కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప ట్టుదలతో సీఎం సహకారంతో బీటీ రోడ్డు నిర్మా ణానికి 600కోట్లు మంజూరు అయ్యాయన్నారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని పెద్దన్నలా నేను, చిన్న అన్నలా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అభివృద్ధి పరుస్తామన్నారు. నియోజ కవర్గంలో రోడ్లను అభివృద్ధిపర్చి మెరుగైన రవాణా సౌక ర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీసింగ్, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌లు బృంగి ఆనంద్‌కుమార్, ప సుల సుదర్శన్‌రెడ్డి, పసుల రాజేష్‌రెడ్డి, కల్వకు ర్తి మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకటయ్యగౌడ్, అశోక్‌రెడ్డి, నాయకులు సంజీవ్‌కుమార్‌యాద వ్, విజయ్‌కుమార్‌రెడ్డి, లింగారెడ్డి, శ్రీనివాస్‌రె డ్డి, రవి, రామకృష్ణ, భూపతిరెడ్డి, హనుమానా యక్, బాలు, రమాకాంత్‌రెడ్డి, కొండల్‌ఉన్నారు.