కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:11 PM
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
చిన్నచింతకుంట/దేవరకద్ర, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని దమగ్నాపూర్‌లో రూ.44 లక్షలతో డ్రైనేజీ, సీసీరోడ్డు, బస్టాండ్, అంగన్‌వాడీ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి, మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. అనంతరం తోకల లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకుముందు దేవరకద్ర మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, మండల అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఫారుక్‌అలీ, ఆలయ చైర్మన్లు గోవర్దన్‌రెడ్డి, నరసింహరెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, మధు, రవిగౌడ్, వజీర్‌బాబు, మోహన్‌రెడ్డి, అనిల్, గోవర్ధన్‌యాదవ్, లక్ష్మికాంత్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌రెడ్డి, శ్రీను, రాంపాండు, జోవహర్, మల్లేష్, శ్రీను, రాము, రాజు పాల్గొన్నారు.