Share News

ఏడాదిలోపు దేవరకద్ర రూపురేఖలు మారుస్తా

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:46 PM

ఏడాదిలోపు దేవరకద్ర రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

ఏడాదిలోపు దేవరకద్ర రూపురేఖలు మారుస్తా
ఎమ్మెల్యే జీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వివిధ పార్టీల నాయకులు

- అభివృద్ధిని చూసే కాంగ్రెస్‌లో చేరికలు

- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

చిన్నచింతకుంట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఏడాదిలోపు దేవరకద్ర రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని దమగ్నాపూర్‌ గ్రామంలోని తన నివాసంలో ఆదివారం దేవరకద్ర మాజీ ఎంపీటీసీ, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉమ్మిగారి వెంకటేష్‌, బలుసుపల్లి మాజీ సర్పంచ్‌ సరోజా శంకర్‌, మాజీ ఉప సర్పంచ్‌ తిరుపతయ్య, మాజీ వార్డు సభ్యులతో పాటు దాదాపు వందమంది బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక కుటంబం లాంటిదని, ఇక్కడకు వచ్చిన వారందరికీ సమాన అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే డిగ్రీ కళాశాలను మంజూరు చేయటం జరిగిందని, బిల్డింగ్‌ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తా మని తెలిపారు. త్వరలో దేవరకద్ర మునిసిపాలిటీకి రూ.15 కోట్ల నిఽధులు మంజూరవుతాయని, దేవరకద్ర మునిసిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గంలో ఫైర వీలకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం వడ్డెమాన్‌లో ఎంబీ మిస్సా చర్చి ప్రారంభో త్సవంలో పాల్గొని, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.5 లక్షల ప్రొసిడింగ్‌ కాఫీని అందజేశారు. గ్రామంలో రెండు హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, కౌకుంట్ల మండల అధ్యక్షుడు రాఘవేందర్‌ రెడ్డి, నాయకులు వట్టెం శివకుమార్‌, రంజిత్‌రెడ్డి, గూడూరు శేఖర్‌, రంజిత్‌, ఎద్దుల మధుసూ దన్‌ రెడ్డి, గోవర్ధన్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:46 PM