Share News

కాలానికనుగుణంగా.. డిజైన్లు రూపొందించాలి

ABN , Publish Date - Aug 07 , 2025 | 11:21 PM

మారుతున్న కాలానికనుణంగా చేనేత డిజైన్లు రూపొందించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి పేర్కొన్నారు.

కాలానికనుగుణంగా..  డిజైన్లు రూపొందించాలి
చేనేత సంఘాలకు రూ.11,48,800 చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ విజయేందిర బోయి

- ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : మారుతున్న కాలానికనుణంగా చేనేత డిజైన్లు రూపొందించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి పేర్కొన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా గద్వాల, నారాయణపేట, అమరచింత, కొత్తకోట చేనేత వస్ర్తాలకు ప్రసిద్ధిగాంచినట్లు ఆమె తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి కంబళ్లను, షాల్స్‌ను తయారు చేస్తున్నారని, జిల్లాను కూడా చేనేత ఉత్పత్తుల్లో ప్రముఖంగా నిలిపేలా కొత్త డిజైన్లతో వస్త్రాలు తయారు చేయాలన్నారు. చేనేత కార్మికుల తయారు చేసిన వస్త్రాలు వారానికోసారి ధరించాలన్నారు. చేనేత వస్త్రాలు కొనవడంతో చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఉపాధి లభిస్తుందన్నారు. అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహరెడ్డి మాట్లాడుతూ చేనేత వృత్తి కాదు ఒక గొప్ప కళ అన్నారు. ప్రతీ ఒక్కరూ చేనేత వస్ర్తాలు ధరించి నేత కార్మికులకు అండగా నిలవాలన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనిత మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ఽధరించి, నేత కార్మికులకు ప్రోత్సాహం అందించాలన్నారు. 16 మంది సీనియర్‌ నేత కార్మికులను కలెక్టర్‌ సన్మానించారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన వ్యాస రచన, వృక్తృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం నేతన్న పొదుపు, భద్రత కింద రూ.11,48,800 చెక్కును చేనేత సంఘాలకు అందజేశారు. అంతకుముందు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ గేటు నుంచి ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు.. జిల్లా కార్యాలయంలో చేనేత స్టాల్‌ను ఏర్పాటు చేశారు. జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఈవో ప్రవీణ్‌కుమార్‌, డీపీఆర్వో శ్రీనివాస్‌, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్ధన్‌, డీవైఎస్‌వో శ్రీనివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈవో సంతోష్‌, చేనేత జౌళి శాఖ డీవో రాజేష్‌బాబు, ఏడీవో లావణ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 11:21 PM