Share News

ఫిల్టర్‌ ఇసుక తయారీ కేంద్రాల కూల్చివేత

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:07 PM

ఇసుక అక్రమ దందాపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ, పోలీసులు స్పందించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, మహమ్మదాబాద్‌ మండల పరిధిలోని అన్నారెడ్డిపల్లి, కంచన్‌పల్లి వాగుల సమీపంలో కొందరు ఫిల్టర్‌ ఇసుకను తయారు చేస్తున్నారు.

ఫిల్టర్‌ ఇసుక తయారీ కేంద్రాల కూల్చివేత
ఫిల్టర్‌ ఇసుక తయారు చేస్తున్న స్థావరాలను ధ్వంసం చేస్తున్న రెవెన్యూ సిబ్బంది

- ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన అధికారులు

మహమ్మదాబాద్‌, నవంబరు 11 (ఆంద్రజ్యోతి) : ఇసుక అక్రమ దందాపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ, పోలీసులు స్పందించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, మహమ్మదాబాద్‌ మండల పరిధిలోని అన్నారెడ్డిపల్లి, కంచన్‌పల్లి వాగుల సమీపంలో కొందరు ఫిల్టర్‌ ఇసుకను తయారు చేస్తున్నారు. ఈ విషయంపై ‘మళ్లీ మొదలైంది’ - యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా’ శీర్షకన మంగళవారం కథనం ప్రచురితమైంది. అందుకు స్పందించిన తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి సిబ్బంది, పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఎక్స్‌కవేటర్‌ సాయంతో ఫిల్టర్‌ ఇసుక తయారీ కేంద్రాలను కూల్చివేశారు. ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు కొందరు అధికారులతో మాట్లాడారు. వెంకట్‌రెడ్డిపల్లి, బొమ్మికుంటతండా, సాకిరేవు, ముకర్లాబాద్‌ రైతు వేదిక నుంచి గుట్ట వైపునకు వెళ్లే ప్రాంతాల్లో ఫిల్టర్‌ ఇసుక తయారీ కేంద్రాలున్నాయని, వాటిని కూడా తొలగించాలని కోరారు. ఫిల్టర్‌ ఇసుక తయారీ, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీటీ శేఖర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శివశంకర్‌, జీసీవోలు శ్రీనివాస్‌గౌడ్‌, బుడ్డన్న,హెడ్‌కానిస్టేబుల్‌ ఆనంద్‌, అశ్వకర్ణిక్‌, వీరేంద్ర తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:07 PM