కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీల ఎన్నిక
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:37 PM
కాం గ్రెస్ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్య క్షుల నియామకం ఉంటుందని పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు.
- పాండిచ్చేరి మాజీ సీఎం వీ నారాయణస్వామి
- బీసీలకు పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్
- రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : కాం గ్రెస్ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్య క్షుల నియామకం ఉంటుందని పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. సోమవా రం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షు డు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమా నికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. జోడోయాత్రలో భాగంగా ఇక్కడి కార్యకర్తల పోరాట పఠిమ చూసి రాహుల్‌గాంధీ ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు. అవినీతి కుటుం బ పాలన చేస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కాం గ్రెస్ పార్టీ కార్యకర్తలు గద్దెదించారని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు పద వులు దక్కుతాయని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ కోసమే తాను కొల్లాపూర్ నియోజకవర్గానికి వచ్చినట్లు వెల్లడిం చారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... బీసీలకు పెద్దపీట వేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. చట్టప్రకారమే బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు ఎన్ని కలు నిర్వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాల సమాఖ్యతో కేంద్రం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కట్టే బదులు రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రూ.30 కోట్లు కేటాయించవచ్చని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సంధ్యా రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించారు. అనంత రం డీసీసీ అధ్యక్షుడి పదవికోసం డాక్టర్ పగిడాల శ్రీనివాస్ రెడ్డి, షేక్‌రహీంపాషా దరఖాస్తు చేసు కున్నారు. కార్యక్రమంలో అబ్జర్వర్ శ్రీనివాస్, పీసీ సీ కార్యదర్శి కే వెంకటేష్, వనపర్తి డీసీసీ అధ్య క్షుడు రాజేంద్రప్రసాద్, వనపర్తి జిల్లా గ్రంథాల య సంస్థల చైర్మన్ గోవర్ధన్, పీసీసీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రంగినేని జగదీశ్వరుడు, శ్రీని వాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు హనుమంత్ నాయక్, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.