Share News

నిబద్ధత గల అక్షర యోధుడు దాశరథి

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:08 PM

తన కవితలు, సాహిత్యం ద్వారా ప్రజా చైతన్యానికి బాటలు వేసిన దాశరథి కృష్ణమాచార్య నిబద్ధత గల అక్షర యోధుడని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌ బాషా కీర్తించారు.

నిబద్ధత గల అక్షర యోధుడు దాశరథి

  • ప్రిన్సిపాల్‌ షేక్‌ కలందర్‌ బాషా

  • ఘనంగా దాశరథి జయంతి

గద్వాలటౌన్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తన కవితలు, సాహిత్యం ద్వారా ప్రజా చైతన్యానికి బాటలు వేసిన దాశరథి కృష్ణమాచార్య నిబద్ధత గల అక్షర యోధుడని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌ బాషా కీర్తించారు. ప్రముఖ కవి, సాహితీవేత్త దాశరథి జయంతిని పురస్కరించుకు ని మంగళవారం గద్వాల పట్టణంలోని మహారాణి ఆది లక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దివంగత కవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ఈసందర్బంగా మాట్లాడిన ప్రిన్సి పాల్‌, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కీలక భూమిక పోషించిన దాశరథి కోటి రతనాల వీణ.. నా తెలంగాణ అంటూ సంధించిన అక్షర బాణం నేటికీ నిత్య నూతనంగా ఉండటం గర్వకారణమన్నారు. తెలుగు విభాగం హెచ్‌ఓడీ మేడిచర్ల హరినాగ భూషణం మాట్లాడుతూ దాశరథి రచించిన ‘కవితా పుష్పకం’ రచనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాహిత్య అకాడమీ అవార్డు రాగా, ‘తిమిరంతో సమరం’ రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులురావడం ఆయన కవితా నైపుణ్యానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా దాశరథి బాల్యం, జీవితంలోని ప్రధాన సంఘట నలు, ఆయన రచన, జీవిత విశేషాలు, తెలుగు, ఉర్దూ, ఆంగ్లభాషలో ఆయన పాండిత్య నైపు ణ్యం గురించి వివరించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ చంద్రమోహన్‌, శంకర్‌, రాధిక, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:08 PM