మొంథా తుపాను ఎఫెక్ట్ .. పత్తి కొనుగోలు నిలిపివేత
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:42 PM
ఉండవల్లి మండలం, వరసిద్ది వినాయక కాటన్ మిల్లులో సోమవారం ప్రారం భం అయినా సీసీఐ పత్తి కొనుగోలుపై మొంథా తుపాను ఎఫెక్ట్ పడింది.
అలంపూరుచౌరస్తా, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉండవల్లి మండలం, వరసిద్ది వినాయక కాటన్ మిల్లులో సోమవారం ప్రారం భం అయినా సీసీఐ పత్తి కొనుగోలుపై మొంథా తుపాను ఎఫెక్ట్ పడింది. ఈ కారణంగానే నేటి బుధవారం నుంచి కొనుగోళ్లకు విరామం ఇస్తు న్నట్లు అలంపూర్ వ్యవసాయ మార్కెట్ సెక్రట రీ ఎల్లస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. మంగ ళవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పత్తిబండ్లు నెమ్మదిగా కదిలాయి. తుపాను ప్ర భావంతో తేమశాతం అధికంగా వస్తుందని సీసీ ఐ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాతనే పత్తి కొనుగోలు ఉంటుందని అధికారులు తెలిపారు. మరో ప్రకటన వచ్చేవరకు రైతులు పత్తి తీసుకురావద్దని సూచించారు.