Share News

సైకిలింగ్‌ను దినచర్యగా మార్చుకోవాలి

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:18 PM

దైనందిన జీ వితం యాంత్రికంగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరూ సైకిల్‌ తొక్కడాన్ని దినచర్యగా మార్చుకోవాలని కలెక్టరే ట్‌ పాలనాధికారి గోపాల్‌ రెడ్డి అన్నారు.

 సైకిలింగ్‌ను దినచర్యగా మార్చుకోవాలి
గద్వాల ఇండోర్‌ స్టేడియం వద్ద సైకిల్‌ ర్యాలీకి హాజరైన డీవైఎస్‌వో, పీడీలు రిటైర్డ్‌ పీడీలు

-కలెక్టరేట్‌ ఏవో గోపాల్‌ రెడ్డి

- ఉత్సాహంగా ‘సండేస్‌ ఆన్‌ సైకిల్‌ ర్యాలీ’

గద్వాల టౌన్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : దైనందిన జీ వితం యాంత్రికంగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరూ సైకిల్‌ తొక్కడాన్ని దినచర్యగా మార్చుకోవాలని కలెక్టరే ట్‌ పాలనాధికారి గోపాల్‌ రెడ్డి అన్నారు. క్విట్‌ ఉద్యమంలో భా గంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా సంస్థ, ఖేలో ఇండియా ఆధ్వర్యం లో చేపట్టిన ‘సండేస్‌ ఆన్‌ సైకిల్‌ ర్యాలీ’ కార్యక్రమాన్ని పురస్క రించుకుని ఆదివారం పట్టణంలోని ఇండోర్‌ స్టేడియం వద్ద సైకిల్‌ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీవై ఎస్‌వో కృష్ణయ్య, శారీరక ధృడత్వాన్ని ప్రోత్సహించడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ ఆచరణగా చేపట్టాల న్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం కేంద్ర ప్రభుత్వం రూ పొందించిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రతీ ఒక్కరూ భాగ స్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ జిల్లా కా ర్యదర్శి శ్రీనివాసులు, స్టేడియం సహాయ అధికారి బషీర్‌ అహ్మ ద్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు నరసింహ రాజు, రజనీకాంత్‌, ఫుట్‌బాల్‌ సీ నియర్‌ కోచ్‌ విజయ్‌కుమార్‌, తైక్వాండో బ్యాచ్‌ విద్యార్థులు, క్రీడా అసోసియేషన్‌ సభ్యులు ఉన్నారు. దాదాపు ఐదు కిలోమీటర్లు సాగిన ర్యాలీలో 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 11:18 PM