జోగుళాంబ ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:41 PM
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో శక్తిపీఠం అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లను దర్శించుకు నేందుకు భక్తులు బారులుతీరారు.
అలంపూర్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి) : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో శక్తిపీఠం అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లను దర్శించుకు నేందుకు భక్తులు బారులుతీరారు. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో చివరి రోజు మంగళవారం రెండు తెలుగురాష్ర్టాల నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అలంపూర్‌కు చేరుకున్నారు. జోగుళాంబాదేవి సిద్దిధాత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గంటల తరబడి క్యూలైనులో నిల్చుని దర్శనం చేసుకున్నారు. ఉద యం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై ఉంచి ఆలయ పరిసరాల్లో ఊరే గింపు చేశారు. నవవర అర్చన, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.