మూడు రోజులైనా తేలని పంటలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:23 PM
వర్షాల కోసం పూ జలు చేసిన రైతులు భారీ వర్షాలకు పంటలు నీట మునగడంతో లబోదిబోమంటున్నారు.
- వడ్డేపల్లి మండలంలో పారుతున్న వాగులు, వంకలు
వడ్డేపల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): నాలుగై దు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పం టలు దెబ్బతింటున్నాయి. వాగులు, వంకల సమీపంలోఎ ఉన్న పంటలు గత మూడురోజు లుగా నీటిలోనే మునిగిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలోఉన్నారు. వర్షాల కోసం పూ జలు చేసిన రైతులు భారీ వర్షాలకు పంటలు నీట మునగడంతో లబోదిబోమంటున్నారు. పంటలపై వరద నీరు ప్రవహిస్తుండటంతో పూత, కాయలు రాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 41.2 మీల్లీమిటర్ల వర్షం కురియడంతో వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్డు తెగిపోయాయి. దీం తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కొంకల, జిల్లేడుదెన్నె, కోవెలది న్న, పైపాడు,బూడిదపాడు గ్రామాల్లో వాగులు, వంకల వెంట ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని రైతులు కన్నీరు మున్నీరుగాల విలపిస్తున్నారు. వందల ఎకరా ల్లో సాగు చేసిన వరి, పత్తి పంటలు ఇంకా వరద నీటిలో మునిగి పోవడంతో రైతులు తీ వ్రంగా నష్టపోయారు. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.