Share News

ధాన్యం అక్రమ రవాణాకు కట్టడి

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:46 PM

ప్రస్తుత వానాకాలం సీజన్‌ లో ధాన్యం పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణలోని జిల్లాలోకి రాకుండా పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్త మైంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది.

ధాన్యం అక్రమ రవాణాకు కట్టడి
కృష్ణ మండలంలోని చేగుంట చెక్‌పోస్టు వద్ద పోలీసుల పహారా

- వానాకాలం సీజన్‌ ప్రారంభం నేపథ్యంలో సరిహద్దులో నిఘా

- కర్ణాటక ధాన్యం రాకుండా చర్యలు

- నారాయణపేట జిల్లాలో ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు

- పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగం తనిఖీ

నారాయణపేట, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వానాకాలం సీజన్‌ లో ధాన్యం పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణలోని జిల్లాలోకి రాకుండా పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్త మైంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సన్నరకం ధా న్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లి స్తుంది. దీంతో కర్ణాటక రాష్ట్రం నుంచి రా ష్ట్రంలోని జిల్లా సరిహద్దులోకి ధాన్యం రా కుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు గు రువారం ఎస్పీ వినీత్‌ తెలిపారు. జిల్లా సరి హద్దులో నారాయణపేట మండలం జిలాల్‌ పూర్‌, దామరగిద్ద మండలం కాన్‌ కుర్తి, కృష్ణ బ్రిడ్జి వద్ద, కృష్ణ మ ండలం చేగుంట, ఉజ్జెల్లి, ఊట్కూ ర్‌ మండలం సమస్తపూర్‌ వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి ధాన్యం రాకుండా పటిష్ట నిఘా ఉంచనున్నారు.

ప్రతీ చెక్‌పోస్టు వద్ద ఇద్దరు పో లీసులు, ఒక రెవెన్యూ అధికారి త నిఖీ చేస్తున్నారు. అలాగే జిల్లా నుంచి రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించకుండా దృష్టి సారించా రు. వాహనాలను తనిఖీ చేసి రిజిస్టర్‌లో నెంబర్లు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా యనే వివరాలు పొందుపరుస్తున్నారు. అ యితే రవాణా శాఖకు సంబంధించి జిల్లా లోని కృష్ణ బ్రిడ్జి వద్ద ఉన్న చెక్‌పోస్టును ఎత్తివేశారు.

Updated Date - Oct 23 , 2025 | 11:46 PM