Share News

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే..

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:40 PM

సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని జేఏసీ చైర్మన్‌ నాగార్జునగౌడు అన్నారు.

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే..
గద్వాల కలెక్టరేట్‌లో నిరసన తెలుపుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు

  • జేఏసీ చైర్మన్‌ నాగార్జునగౌడు

గద్వాలన్యూటౌన్‌, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని జేఏసీ చైర్మన్‌ నాగార్జునగౌడు అన్నారు. సోమవారం గద్వాల జిల్లాలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ టీజేఈజేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ప్రాంగణంలో సీపీఎస్‌ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల భాగస్వామ్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెన్షన్‌ అనేది ఉద్యోగుల హక్కు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సీపీ ఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమం లో సీపీఎస్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరా జు, హాస్టల్‌ వార్డెన్‌ సుజాత, బీజాపూర్‌ ఆనంద్‌, భీమన్న, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు రమేశ్‌, గోపాల్‌, రమేష్‌, లక్ష్మన్న, బుచ్చ న్న, ఈశ్వర్‌, రామన్‌గౌడు, ఖాజామీర్‌, లక్ష్మీనారాయణ, నాగేశ్‌, రాజేశ్‌ ఉన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 11:40 PM