Share News

సీపీఎస్‌ను రద్దు చేయాలి

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:27 PM

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు చేయాలని యూటీఎఫ్‌ జడ్చర్ల మండల అధ్యక్షుడు కృష్ణ డిమాండ్‌ చేశారు.

సీపీఎస్‌ను రద్దు చేయాలి
జడ్చర్లలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న యూటీఎఫ్‌ నాయకులు

- నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

జడ్చర్ల/మిడ్జిల్‌/మూసాపేట, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు చేయాలని యూటీఎఫ్‌ జడ్చర్ల మండల అధ్యక్షుడు కృష్ణ డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా సోమవారం జడ్చర్ల జడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, ఆ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. నూతన పెన్షన్‌ విధానంతో రిటైర్డ్‌ ఉపాధ్యాయులకు లాభం లేదని, కేవలం నాలుగు, ఐదు వేలు మాత్రమే పెన్షన్‌ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ రద్దు చేయకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూటీఎఫ్‌ సభ్యులు మన్యం, శ్రీనివాస్‌, నరేశ్‌, శివకుమార్‌, శ్రీనివాస్‌ఆర్య, గౌసియాబేగం, శారద, సుమతి, శ్రీలత పాల్గొన్నారు. మిడ్జిల్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నాయకులు శ్రవణ్‌, నర్సింహులు, సందీప్‌, సుదర్శన్‌, సునిత, లాలు, నరేష్‌, శ్రావణి, శైలజ, రమేష్‌గౌడ్‌, గురుప్రసాద్‌, హర్య, జ్యోష్నదేవి, రాఘవేందర్‌, మధు, సత్యనారాయణ, శ్రీలత, మోహన్‌, అమ్జద్‌ పాల్గొన్నారు. అడ్డాకుల మండలం టీఎస్‌ యూటీఎఫ్‌ మండల అధ్యక్షడు నాగమద్దిలేటి, కార్యదర్శి చిన్నయ్య మఽధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌కు తరలిన ఉపాధ్యాయులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిర పార్కు వద్ద చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన నాలుగు వేల మంది పీఆర్టీయూ నాయకులు సామూహిక సెలవు పెట్టి తరలివెళ్లారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం నుంచి బయలు దేరిన వాహనాలను జిల్లా అధ్యక్షుడు మధన్‌మోహన్‌యాదవ్‌ జెండా ఊపి ప్రారంభించారు. తరలివెళ్లిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, గౌరవ అఽధ్యక్షుడు బుచ్చారెడ్డి, నాయకులు అశ్విని చంద్రశేఖర్‌, గోపాల్‌నాయక్‌, పురుషోత్తం, శ్రీకాంత్‌, విజయానంద్‌రెడ్డి, స్వామి, భీమ్‌రెడ్డి, శ్రీనివాసులు, హరినాథ్‌, రేవతి ఉన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 11:27 PM