ప్రజా సమస్యలపై సీపీఎం సర్వే
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:08 PM
మండలంలోని లింగంపేటలో గురువారం ప్రజా సమస్యలపై సీపీఎం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు.

జడ్చర్ల, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని లింగంపేటలో గురువారం ప్రజా సమస్యలపై సీపీఎం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడుతూ లింగంపేటలో 150 మంది లబ్ధిదారులు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 32 మందిని మాత్రమే లబ్ధిదారుల జాబితాలో ఉన్నారన్నారు. గ్రామంలో డ్రైనేజీ, సీసీరోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారని, వీధిలైట్లు, తాగునీటి సౌకర్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు పలు సమస్యలు గ్రామస్థులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థులను సమీకరించి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. సీపీఎం నాయకులు సాయిలు, జగన్, యాదయ్య, శ్యాంసుందర్, నర్సిములు, విజయ్, జగన్ పాల్గొన్నారు.
పాలమూరు : పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని సీపీఎం పట్టణ ప్రతినిధి బృందం ప్రభుత్వాన్ని కోరింది. గురువారం జిల్లా కేంద్రంలోని వీరన్నపేట, చక్కనిరాయి ఏరియా డబుల్ బెడ్‌రూం పరిసరాల్లో ప్రజల సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. డ్రైయినేజీ లేకపోవడంతో మురుగునీరు పారుతోందన్నారు. విద్యుత్ సరఫరా కోసం వైరు లేక అస్తవ్యస్తంగా ఉందన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బి.చంద్రకాంత్, కిల్లె గోపాల్, గోపాల్, మధు, రామకృష్ణ, సత్తయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.