పెద్దపులి దాడిలో ఆవుదూడ మృతి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:40 PM
అమ్రాబాద్ అభయార ణ్యంలో పెద్దపులి దాడి చేసి బుధవారం అవుదూడను చంపివేసింది.
- పంచనామా నిర్వహించిన అటవీశాఖ అధికారులు
బ్రహ్మగిరి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అమ్రాబాద్ అభయార ణ్యంలో పెద్దపులి దాడి చేసి బుధవారం అవుదూడను చంపివేసింది. బ్ర హ్మగిరి ఎఫ్‌ఆర్‌వో గురుప్రసాద్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మగిరి రేంజ్ పరిధిలోని వటువర్లపల్లి నార్త్ బీట్‌లో రైతు కరంటోత్ శ్రీరాం ఆవుదూడ మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్లగా పెద్దపులి దాడి చేసి ఆవుదూడను చంపి కొంత భాగాన్ని తినడం జరిగిందన్నారు. బాధిత రైతుకు అటవీశాఖ తరుపు నష్ట పరిహారం చెలిస్తామని ఆయన పేర్కొ న్నారు. పశువులు, గేదెలపై అటవీ జంతువుల డాదిలో మృతి చెందితే సమాచారం ఇచ్చి నష్ట పరిహారం పొందాలని, అటవీ జంతువులకు హాని తలపెడితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పెద్దపులిని గుర్తించేందుకు ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఎఫ్‌ఆర్‌వో చెప్పారు.