Share News

స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:17 PM

స్థానిక సం స్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం కానుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో  కోర్టు తీర్పు కీలకం
మాట్లాడుతున్న నిరంజన్‌రెడ్డి

- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

- బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

- కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే ఎంపిక

వనపర్తి రూరల్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సం స్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం కానుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండ లంలోని రాజపేట శివారులోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను రేవంత్‌రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. బీసీలను గందరగోళ పరిస్థితులకు గురి చేయడం పట్ల బీసీ నాయకులు స్పందించకుండా ఉండడం మంచిది కాదని అన్నారు. తొమ్మిదేళ్లలో పాన్‌గల్‌ జనరల్‌ స్థానాలలో ఎస్టీ బిడ్డను, వనపర్తి మునిసిపాలిటీలో బీసీ బిడ్డను అందలం ఎక్కించిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కిందని అన్నారు. నియోజకవర్గంలో మెజార్టీ సీట్లు గెలుస్తామని నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాను ప్రకాష్‌ రావు, విజయ్‌కుమార్‌, మతీన్‌, రఘువర్ధన్‌ రెడ్డి, రవి ప్రకాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Updated Date - Oct 06 , 2025 | 11:17 PM