Share News

కస్తూర్బా పాఠశాల ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:28 PM

ఇంగ్లిష్‌ బోధించే టీచర్‌ రంగినేని కళ్యాణి చిట్టి డబ్బులు రూ. 6,65,000 ఇవ్వాలని

కస్తూర్బా పాఠశాల ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం
దంపతుల నుంచి పురుగు మందు డబ్బాలను లాక్కుంటున్న పాఠశాల సిబ్బంది

పెంట్లవెల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఇంగ్లిష్‌ బోధించే టీచర్‌ రంగినేని కళ్యాణి చిట్టి డబ్బులు రూ. 6,65,000 ఇవ్వాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి కస్తూర్బా పాఠశాల ముందు చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య, మంగ మ్మ, వారి కుమారుడు విష్ణు మంగళవారం క్రిమిసంహారక మందు తాగేందుకు యత్నిం చారు. అదే సమయంలో అక్కడ ఉన్న పాఠ శాల సిబ్బంది గమనించి వారి చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను లాగేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని వైద్యం కో సం ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనం తరం వారిని ఇంటికి పంపించేశారు. ఈ సం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ తెలిపారు.

Updated Date - Sep 09 , 2025 | 11:28 PM