Share News

బాధిత కుటుంబానికి పరామర్శ

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:34 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి హత్యాచార ఘటన బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ విజయేందిరబోయి ఆదివారం పరామర్శించారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌

మూసాపేట, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి హత్యాచార ఘటన బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ విజయేందిరబోయి ఆదివారం పరామర్శించారు. ప్రభుత్వపరంగా అండగా ఉంటామని, న్యాయం చేస్తామని చెప్పారు. రూ.50 వేల ఆర్థికసాయం అందించారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, యువతి తల్లికి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం, తమ్ముడికి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో సీటు కల్పిస్తామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు కేసుకు సంబంధించిన ఆంశాలపై సమగ్రంగా విచారణ చేశాక, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తహసీల్దార్‌ ద్వారా బాధిత కుటుంబానికి మూడు నెలలకు సరిపడ సరుకులు అందించామన్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన పరిహారం అందించి, ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, ఆర్టీఓ నవీన్‌, తహసీల్దార్‌ రాజు, సర్పంచ్‌ రవిరాజాచారి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాలనర్సింహులు, సత్యనారాయణ, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 11:34 PM