సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:57 PM
ముందస్తు సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం, తమ వార్డులో పనులు చేపట్టాల్సిన అంశంపై నిధులు కేటాయించకపో వడం తదితర కారణాలతో కౌన్సిల్ సమావేశాన్ని కౌ న్సిలర్లు నంద కిశోర్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మాజీ చైర్‌పర్సన్ లక్ష్మీ బహిష్కరించారు.
జడ్చర్ల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ముందస్తు సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం, తమ వార్డులో పనులు చేపట్టాల్సిన అంశంపై నిధులు కేటాయించకపో వడం తదితర కారణాలతో కౌన్సిల్ సమావేశాన్ని కౌ న్సిలర్లు నంద కిశోర్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మాజీ చైర్‌పర్సన్ లక్ష్మీ బహిష్కరించారు. కోరం లేకపోవడంతో కౌన్సిల్ సమావేశాన్ని వా యిదా వేసినట్లు మునిసిపల్ చైర్ పర్సన్ పుష్పలత, కమిషనర్ లక్ష్మారెడ్డి వెల్లడిం చారు. జడ్చర్ల మునిసిపల్ కార్యాల యంలో మునిసిపల్ కౌన్సిల్ సమావేశాన్ని చైర్‌పర్సన్ పుష్పలత, కమి షనర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉ దయం 11 గంటలకు ప్రారంభం కావలసిన సమావేశానికి 11.30 గంటల వరకు సమావేశానికి కావలసిన కోరం సంఖ్యలో కౌన్సిలర్‌లు పాల్గొనక పోవడంతో కౌన్సిల్‌ను వాయిదా వేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇదిలా ఉండగా కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండానే తమ వార్డుల్లో పర్యటిస్తున్నారని, సమాచారం ఎందుకు ఇవ్వరంటూ మునిసిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట కౌన్సిలర్లు ప్రశ్నించారు. వార్డులో జరగాల్సిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంలో సైతం వివక్ష చూపారంటూ ఆరోపించారు. ముందస్తు సమాచారంతో పాటు ఎజెండా ఇవ్వకుండానే కౌన్సిల్ సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మునిసిపల్ చైర్‌పర్సన్, కమిషనర్‌ల వైఖరికి నిరసనగా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి నట్లు వారు తెలిపారు.