నిబంధనల మేరకే పత్తి కొనుగోళ్లు జరగాలి
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:32 PM
సీసీఐ నిబంధనల మేరకే పత్తి కొనుగోళ్లు జరగాలని గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
- ఉండవల్లిలో పత్తి మిల్లును పరిశీలించిన కలెక్టర్ బీఎం సంతోష్
అలంపూర్ చౌరస్తా, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సీసీఐ నిబంధనల మేరకే పత్తి కొనుగోళ్లు జరగాలని గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం జో గుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండ లంలోని వరసిద్ధి వినాయక పత్తి మిల్లు లోని ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతు పత్తిని సరై న తేమశాతంతో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చేవిధంగా ఏఈవోలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఉండవెల్లి మండలంలోని బోం కురు జడ్పీహెచ్‌ఎస్‌లో డిజిటల్ బోధన ను పరిశీలించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయా లని ఉపాధ్యాయులకు సూచించారు. అ నంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట జిల్లా మార్కె టింగ్ అధికారి, సీసీఐ అధికారి రాహుల్ కలానా, ఎల్లస్వామి తదితరులు ఉన్నారు.