Share News

స్వచ్ఛభారత్‌ మిషన్‌లో అవినీతి

ABN , Publish Date - May 13 , 2025 | 11:24 PM

గద్వాల మండలం అనంతాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి శేఖర్‌ను కలెక్టర్‌ బీఎం సంతోష్‌ స స్పెండ్‌ చేశారు. శుక్రవారం సస్పెండ్‌ చేయ గా అధికారులు ఈ విషయంను గోప్యంగా ఉంచారు.

స్వచ్ఛభారత్‌ మిషన్‌లో అవినీతి

- అనంతాపురం గ్రామ కార్యదర్శి సస్పెన్షన్‌

- గోప్యంగా ఉంచిన అధికారులు

గద్వాల, మే 13(ఆంధ్రజ్యోతి): గద్వాల మండలం అనంతాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి శేఖర్‌ను కలెక్టర్‌ బీఎం సంతోష్‌ స స్పెండ్‌ చేశారు. శుక్రవారం సస్పెండ్‌ చేయ గా అధికారులు ఈ విషయంను గోప్యంగా ఉంచారు. గ్రామ పంచాయతీకి స్వచ్ఛభారత్‌ మిషన్‌ (వ్యక్తిగత మరుగుదొడ్డ నిర్మాణం)కిం ద నిధులు మంజూరయ్యాయి. అయితే వీటి లెక్కల్లో తేడాలు ఉండటంతో గ్రామ కార్యదర్శి శేఖర్‌ను జిల్లా పంచాయతీ అధికారి వివరణ కోరాడు. లబ్ధిదారుల ఖాతాలో జమచేసినట్లు కార్యదర్శి చెప్పాడు. అయితే అనుమానాస్పద ఖాతాలకు బదిలీలు ఉండటంతో అధికారులు గ్రామంలో విచారణ చేయగా స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఖాతాలో రూ.7లక్షలు తేడా వచ్చింది. ఇవి ఎక్కడికి బదిలీ అయ్యా యని విచారణ చేయగా కొందరి వ్యక్తిగత ఖాతాలకు బదిలీ అయినట్లు అధికారులు గు ర్తించి కలెక్టర్‌కు నివేదించారు. ఈ మేరకు కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారని డీఎల్‌పీవో మహేశ్‌ తెలిపారు. ఈ విషయాన్ని అధికారు లు గోప్యంగా ఉంచడంపై పలుఅనుమానా లు వ్యక్తమవుతున్నాయి. ఇదొక్క గ్రామంలోనే జరిగిందా? జిల్లాలో ని మరిన్ని గ్రామాలలో జరగాయా? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తునట్లు తెలుస్తున్నది.

Updated Date - May 13 , 2025 | 11:24 PM