కార్పొరేట్‌కు దీటుగా
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:37 PM
దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను అధునీకరించి కార్పొ రేట్‌కు ధీటుగా వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అం దిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.
- రూ. 2 కోట్లతో పాఠశాల భవనాన్ని నిర్మించిన అరబిందో
- ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి
బిజినేపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను అధునీకరించి కార్పొ రేట్‌కు ధీటుగా వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అం దిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం జడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో అరబిందో ఫార్మా సహకారంతో రూ.2కోట్లు వెచ్చించి నిర్మించిన నూతన భవనాన్ని అరబిందో ఫార్మా డైరెక్టర్లు శరత్ చంద్రారెడ్డి, సదానంద రెడ్డిలతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా బెంచీ లు, గ్రీన్ బోర్డులు, కంప్యూటర్లు అందజేసినట్లు తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా విద్యా బోధన సాగినప్పుడే ప్రపంచంతో పోటీపడే నైపుణ్యాలు విద్యార్థులకు అందుతా యని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అరబిందో ఫార్మా సీఎస్‌ఆర్ నిధులతో పాఠశాల నిర్మాణానికి కృషి చేసి న నరేందర్ రెడ్డి, దేవేందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మల్లేపల్లి శ్రీని వాస్ రెడ్డిలకు, స్థలదాతలు పుట్ట వెంకట్‌రెడ్డి, గుబ్బ సత్య నారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అమృత్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు తిరుపతిరెడ్డి, భగవంత్‌గౌడ్, రాగి మధుసూదన్‌రెడ్డి, ఎంఈవో రఘునంద న్ శర్మ, హెచ్‌ఎం తదితరులు ఉన్నారు.