ఆస్పత్రిలో విద్యార్థులకు పరామర్శ
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:37 PM
అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయా న్ని తెలుసుకున్న జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత ఆసుపత్రిలోని విద్యార్థులను పరామర్శించి మంగళవారం యోగ క్షేమాలను తెలుసుకున్నారు.
గద్వాల క్రైం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎస్టీ వసతిగృహంలోని విద్యార్ధులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయా న్ని తెలుసుకున్న జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత ఆసుపత్రిలోని విద్యార్థులను పరామర్శించి మంగళవారం యోగ క్షేమాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కా కుండా చూడాలని వార్డెన్‌కు సూచించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి విద్యార్ధులకు మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు. ఆమెవెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.