Share News

నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:38 PM

నర్సింగ్‌ కళాశాల భవనం ప్రారంభోత్సవానికి ముందే పనులను పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి
నర్సింగ్‌ కళాశాల భవనం వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): నర్సింగ్‌ కళాశాల భవనం ప్రారంభోత్సవానికి ముందే పనులను పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప రమాల శివారులో రూ.30 కోట్లతో నిర్మిస్తున్న న ర్సింగ్‌ కళాశాల, హాస్టల్‌ భవనాల నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. నర్సింగ్‌ కళాశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అ న్ని సౌకర్యాలతో భవన నిర్మాణం పూర్తి అవు తుందని వివరించారు. త్వరలో భవన నిర్మాణం ప్రారంభోత్సవం ఉందని అంతకుముందే పను లు పూర్తి చేయాలని అన్నారు. అంతర్గత రహదారులు, నీటివసతి, ఫర్నీచర్‌తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంత రం క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మ్యాప్‌ను పరిశీలించి త గు సూచనలు చేశారు. అదేవిధంగా జిల్లా ఆసుపత్రి భవనంలోని మెడికల్‌ కళాశాలలో వి విధ విభాగాలను పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. నర్సింగ్‌ కళాశాల భవనం ప్రారంభం అయ్యాక పాత ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న నర్సింగ్‌ క ళాశాల విద్యార్థులు కొత్త భవనంలోకి షిఫ్ట్‌ అవు తారని, ఖాళీ అయిన ఆ భవనంలో మెడికల్‌ కళాశాల బాలురకు వసతి సౌకర్యం కల్పించాల ని ఆదేశించారు. గద్వాలలో రూ.130 కోట్లతో నిర్మించే మెడికల్‌ కళాశాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంట భగీరథ ఈఈ శ్రీధర్‌రెడ్డి, టీసీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వేణుగోపాల్‌, ఏఈ రహీం, ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఇందిర, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నాగేశ్వర్‌రావు, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హనుమంతమ్మ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:38 PM