Share News

నత్తనడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

ABN , Publish Date - May 03 , 2025 | 11:35 PM

రాష్ట్రంలో నిరుపేద ల సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారం భించింది.

 నత్తనడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
వనపర్తి మండలం అప్పాయిపల్లిలో బేస్‌మెంట్‌ దశలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు

- ముందుకురాని లబ్ధిదారులు

- చాలా చోట్ల ప్రారంభించని పనులు

- పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలో మంజూరైన 1208 ఇళ్లు

- 415 ముగ్గు పోసినవి, 91 బేస్‌మెంట్‌ లెవల్‌కు వచ్చిన నిర్మాణాలు

- 45 మంది లబ్ధిదారులకు మొదటి విడతలో మంజూరైన లక్ష రూపాయలు

వనపర్తి, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుపేద ల సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారం భించింది. ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడంలో జాప్యం జరుగుతుంది. ప్రభుత్వం మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించింది. తొలుత పైలట్‌ ప్రాజెక్టు కింద కొన్ని మండలాల్లోని మోడల్‌ గ్రామాల్లో అర్హులకు ఇళ్లు మంజూరు చేసింది. మొదటి విడతలో జిల్లా లోని 15 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి 1,208 లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఎంపి కైన ప్రతీ ఒక్కరు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 415 మంది మాత్రమే ము గ్గు పోశారు. అందులో బేస్‌మెంట్‌ స్థాయిలో నిర్మా ణాలు జరుగుతున్నవి 91 కాగా ఇప్పటి వరకు మొద టి విడతలో జిల్లా వ్యాప్తంగా 45 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున నిధులు మంజూరయ్యాయి.

విడతల వారీగా బిల్లులు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల సా యం అందించనుంది. ఇం టి నిర్మాణాన్ని బట్టి ఆ యా దశల్లో బిల్లులు చె ల్లించేందుకు నిర్ణయిం చింది. బేస్‌మెంట్‌ దశ లో రూ. లక్ష, లెంటల్‌ లెవల్‌ వరకు రూ. లక్ష, స్లాబ్‌ లెవల్‌ వరకు రూ.2 లక్షలు, మొత్తం పనులు పూర్తయ్యాక ఒక లక్ష అం దించనుంది. పంచాయతీ కార్యదర్శులు ఇంటి నిర్మా ణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీని ఆధా రంగానే బిల్లులు వచ్చే అవకాశముంది. సర్వే అప్పు డు చూపిన స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవాలనే నిబంధనను ప్రభుత్వం సడలించినట్లు సమాచారం. అంతే కాకుండా 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు స్థలంలో మాత్రమే ఇంటి నిర్మాణాన్ని చేసుకో వాలని, ఆ పైన నిర్మించుకునే వారిని రద్దు చేయాల ని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారు లు కూడా మే 10 వరకు పనులు ప్రారంభించకపోతే వారిని రద్దు చేసి, వారి స్థానంలో కొత్త వారిని ఎంపి క చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొదటి విడతలో ఎంపికైన లబ్ధిదారుల్లో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వీరంతా రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఇంటి నిర్మాణం చేపట్టే స్థోమత లేక నిర్మాణ పనులు ప్రారంభించడం లేదు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు గుత్తేదారులకు అప్పగించి ఇంటి నిర్మాణాలను చేయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - May 03 , 2025 | 11:35 PM