ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - May 08 , 2025 | 11:50 PM
మొదటి విడతలో మంజూ రైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వనప ర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎంపీడీవోలను ఆదేశించారు.
- వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మే 8 (ఆంధ్రజ్యోతి):మొదటి విడతలో మంజూ రైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వనప ర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మునిసిపల్ కమిషనర్లతో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం, ఉపాధి హామీ పథకం,సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి విడతలో ప్రతీ మండలం నుంచి ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 1,300 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. అందులో ఇప్పటి వరకు గ్రౌండింగ్ చేసిన వివరాలు, పెండింగ్‌లో ఉండ టానికి కారణాలపై సమీక్ష నిర్వహించారు. రాజీవ్ యువవికాసం పథకా నికి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను బ్యాంకులకు అందజేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో 2025-26 ఆర్థిక సంవ త్సరంలో కూలీలకు 15 లక్షల పని దినాలు కల్పించాలని నిర్దేశించడం జరిగిందన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్‌డీవో ఉమాదేవి, లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.