Share News

విషాదం మిగిల్చిన కొత్తింటి నిర్మాణం

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:16 PM

ఇంటి నిర్మాణ పనులకు వాటర్‌ క్యూరింగ్‌ చేయడానికి మోటార్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతంతో వి వాహిత మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలంలోని పెద్దపొర్ల గ్రామం లో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.

విషాదం మిగిల్చిన కొత్తింటి నిర్మాణం
నింగమ్మ (ఫైల్‌)

- క్యూరింగ్‌ కోసం మోటార్‌ ఆన్‌ చేస్తుండగా షాక్‌ తగిలి వివాహిత మృతి

ఊట్కూర్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఇంటి నిర్మాణ పనులకు వాటర్‌ క్యూరింగ్‌ చేయడానికి మోటార్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతంతో వి వాహిత మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలంలోని పెద్దపొర్ల గ్రామం లో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద పొర్ల గ్రామానికి చెందిన కుర్వ అశోక్‌, భార్య నిం గమ్మ (35) పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. పనులను ప్రారం భించి బేస్మెంట్‌ వరకు పూర్తి చేయగా, బుధవారం వాటర్‌ క్యూరింగ్‌ చే యడానికి నింగమ్మ మోటార్‌ను ఆన్‌ చేయడంతో ఒక్కసారిగా షాక్‌ తగిలి పడిపోయింది. గ్రామస్థులు ఆమెను పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. భర్త అశోక్‌ రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గురు వారం ఉదయం నింగమ్మ మృతదేహాన్ని నారాయణపేట ఆసుపత్రికి పో లీసులు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. వీరికి ముగ్గురు కుమా రులు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన సంతోషంలో ఇంటి పనులు చే పట్టగా, ఇంతలోనే భార్య మృతి చెందడంతో భర్తతో పాటు ముగ్గురు పిల్లలు బోరున విలపించారు.

Updated Date - Oct 09 , 2025 | 11:16 PM