రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:24 PM
బీసీ రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే బిక్ష కాదని.. తమ హక్కు అని వనపర్తి జిల్లా బీసీ నేతలు వ్యాఖ్యానించారు.
వనపర్తి రూరల్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : బీసీ రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే బిక్ష కాదని.. తమ హక్కు అని వనపర్తి జిల్లా బీసీ నేతలు వ్యాఖ్యానించారు. బీసీలకు విద్య, ఉ ద్యోగ, రాజకీయ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చే సి, 9వ షెడ్యూల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్ల తో బీసీ జేఎసీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం వనపర్తి జిల్లా కేంద్రం లోని మర్రికుంట ఽధర్నా చౌక్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ప్రధాన కార్యద ర్శి ముకుంద నాయుడు అధ్యక్షతన బీసీల న్యా య సాధన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు అరవింద్ స్వామి మాట్లాడు తూ... బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పిం చే విజయమై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే అఖి లపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలన్నా రు. వచ్చే పార్లమెంట్ సమావేశంల్లో రాజ్యాంగా న్ని సవరించే విషయమై కేంద్రంపై ఒత్తిడి పెం చాలన్నారు. 42శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని చె ప్పారు. బీసీల వాటా బీసీలకు దక్కితేనే న్యా యం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి అర వింద్ స్వామి, ముకుంద నాయుడు, చిట్యాల రాములు, శివ నాయక్, దయానంద్ ముదిరాజ్, ఆంజనేజయులు, శివుడు పాల్గొన్నారు.