రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:15 PM
రోడ్డు ప్రమాదంలో ఓ కా నిస్టేబుల్ మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరి ధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది.
పెద్దకొత్తపల్లి/రేవల్లి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో ఓ కా నిస్టేబుల్ మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరి ధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకొ త్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విఽ దులు నిర్వహిస్తున్న ఎత్తపు ఆంజనేయులు (33) విధులను ముగించుకొని శుక్రవారం రాత్రి తన స్వగ్రామమై న రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి బైకుపై బయలుదేరా డు. 167 నెంబరు జాతీయ రహదారిపై వావిళ్లబాయి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యా డు. అది గమనించిన స్థానికులు నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమ తోటి కా నిస్టేబుల్ ఆకస్మికంగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు విడువ డాన్ని పోలీసు సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుని భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్‌ఐ వి.సతీష్ తెలిపారు. రెండు నెలల క్రితం పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న వెంకటస్వామి కూడా ఇదే రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. వరుస ప్రమా దాలపై పోలీసులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికార లాంఛనాలతో అంతిమయాత్ర
మృతి చెందిన కానిస్టేబుల్ ఆంజనేయులు అంతిమయాత్రను శనివారం పోలీసులు అధికార లాంఛనాలతో నిర్వహించారు. శానా యిపల్లి గ్రామంలోని వారి ఇంటి దగ్గర జరిగిన అంత్యక్రియల్లో పెద్దకొత్తపల్లి డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.