Share News

ఉపాధిహామీని నిర్వీర్యం చేసే కుట్ర

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:33 PM

పాఽధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మహబూబ్‌నగర్‌, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జీ మధుసూదన్‌ రెడ్డి అన్నారు.

ఉపాధిహామీని నిర్వీర్యం చేసే కుట్ర
ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎంఆర్‌, యెన్నం

ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జీ మధుసూదన్‌ రెడ్డి

పాలమూరులో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉపాఽధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మహబూబ్‌నగర్‌, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జీ మధుసూదన్‌ రెడ్డి అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తీసివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఆదివారం మహబూబ్‌నగర్‌లోని అశోక్‌ టాకీస్‌ చౌరస్తాలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ దేశంలోని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉన్నత లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చిందన్నారు. ప్రత్యేకించి క రువు సమయాల్లో ఈ పథకం దేశంలోని పేదలకు రక్షణ కవచంలా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే జి మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ పథకంలోని గాంధీ పేరును తొలగించడం తీవ్రంగా బాధిస్తోందన్నారు. కార్యక్రమంలో టీజీఎంఎస్సీ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, గ్రంఽథాలయ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనితా రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అమరెందర్‌ రాజు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌, సీనియర్‌ నాయకులు వినోద్‌ కుమార్‌, ఏపీ మిఽథున్‌ రెడ్డి, చంద్రకుమార్‌ గౌడ్‌, జహీర్‌ అక్తర్‌, ఎన్‌పీ వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 11:33 PM