Share News

కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక పాలన

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:38 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్‌ విమర్శించారు.

కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక పాలన

- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్‌

ఊర్కొండ, అక్టోబరు, 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్‌ విమర్శించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా, ఊర్కొండ మండంలోని ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ కలహాలతో సతమతమవు తుండటంతో రాష్ట్ర ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ పార్టీ డ్రామాలకు తెరలేపిందని, బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయ త్నం చేస్తోందని విమర్శించారు. బీసీలు, రైతులు, ప్రజలందరూ కలిసి ఓడగొడతారనే భావనతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదని ఆరోపించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన ఎస్సీ మోర్చా మండల మాజీ అధ్యక్షుడు గడ్డం మహేందర్‌ కుటుంబ స భ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షు డు, మాజీ సర్పంచ్‌ నిరంజన్‌ గౌడ్‌, నాయకులు శ్యామ్‌సుందర్‌ రెడ్డి, ప్ర తాప్‌రెడ్డి, అరవింద్‌గౌడ్‌, దివాకర్‌గౌడ్‌, తాడెం చిన్న, శేఖర్‌, శివకుమార్‌, నరేందర్‌గౌడ్‌, రాజ్‌ నారాయణరెడ్డి, ఆనంద్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 11:38 PM