Share News

భూ నిర్వాసితులకు కాంగ్రెస్‌ అండ

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:17 PM

భూ నిర్వాసితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం అనుగొండ గ్రామంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఏరియల్‌ సర్వే చేశారు.

భూ నిర్వాసితులకు కాంగ్రెస్‌ అండ
మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌, చిత్రంలో మంత్రి వాకిటి శ్రీహరి

భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

మక్తల్‌ మండలం అనుగొండలో ఏరియల్‌ సర్వే

మక్తల్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : భూ నిర్వాసితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం అనుగొండ గ్రామంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఏరియల్‌ సర్వే చేశారు. అనంతరం భూ నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకుంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు జూరాల ముంపు ప్రాంతాలు అయిన అనుగొండ, అంకెన్‌పల్లి, గడ్డంపల్లి తదితర గ్రామాల సమస్యలను 15 నెలల్లో పరిష్కరిస్తానన్నారు. ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అయిన నూతన పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. 80.12 ఎకరాల్లో సకల సౌకర్యాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రూ. 42.11 కోట్లతో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంకెన్‌పల్లి, దాదన్‌పల్లి గ్రామాలకు త్వరలోనే నూతన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడ్‌గం, భూత్పూర్‌ గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ జీవో త్వరగా ఇప్పిస్తామన్నారు. జూరాల, సంగంబండ, భూత్పూర్‌ రిజర్వాయర్లలో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో పేరుకుపోయిన ఇరిగేషన్‌ కాల్వలు, సంగంబండ గేట్ల మరమ్మతులు త్వరలో చేస్తామన్నారు.

డిసెంబరు 1న అభివృద్ధి పనుల ప్రారంభం

పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గోలపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల, మక్తల్‌, నారాయణపేట నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులను డిసెంబరు 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. మక్తల్‌ నియోజకవర్గం కృష్ణ ప్రాంతంలో పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని, కర్ణాటక సరిహద్దులో కృష్ణా నదిపై కొత్త బ్రిడ్జి పూర్తి అయిన తర్వాత పాత బ్రిడ్జిని చెక్‌ డ్యాంగా మారిస్తే.. 2 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చని, లిఫ్ట్‌ ఇరిగేషన్లకు మరమ్మతు చేయాలని, మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో చెక్‌డ్యాంలు ఏర్పాటు చేయాలని ఉత్తమ్‌ దృ ష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి చేస్తుంటే కొందరు జీర్ణించుకోలేక సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నారని, వారికి అభివృదితోనే సమాధానం చెబుతానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ జీ.హన్మంతు, పార్టీ మండల అధ్యక్షడు గణే్‌షకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 11:17 PM