క్లోజింగ్ తెలంగాణ వైపు కాంగ్రెస్ పాలన
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:20 PM
తెలంగాణ రైజింగ్ పేరిట కాంగ్రెస్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి విశ్రీనివా్‌సగౌడ్ అన్నారు. రెండేళ్ల హయాంలో క్లోజింగ్ తెలంగాణ వైపు పాలన సాగుతుందని విమర్శించారు.
రైజింగ్ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం హాస్యాస్పదం
మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివస్
మహబూబ్‌నగర్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్ పేరిట కాంగ్రెస్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి విశ్రీనివా్‌సగౌడ్ అన్నారు. రెండేళ్ల హయాంలో క్లోజింగ్ తెలంగాణ వైపు పాలన సాగుతుందని విమర్శించారు. ఏం సాధించారని సమ్మిట్‌లు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. మంగళవారం బీఆర్‌ఎస్ విజయ్ దివ్‌సను పురస్కరించుకుని నగరంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, బెలూన్‌లు వదిలారు. అనంతరం రూరల్ మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారన్నారు. ఎరువులకోసం క్యూలో నిలబటం, పండించిన పంటలకు బోనస్ లేకపోవడం, కరెంట్ కోతలు, తాగునీటి కష్టాలతో తెలంగాణను వెనక్కి నెట్టివేస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. మళ్లీ రైజింగ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఆనాడు ఆమరణదీక్ష చేపట్టినందునే డిసెంబరు 9 తెలంగాణ ప్రక్రియను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వచ్చిందన్నారు. అందుకే ఈరోజును విజయ్‌దివ్‌సగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్, కేసీ నర్సింహులు, గంజి ఎంకన్న, శివరాజు. తాటి గణేష్, గిరిధర్‌రెడ్డి, నవకాంత్, శ్రీనివా్‌సరెడ్డి, మోహన్‌బాబు, అహ్మదొద్దీన్, సుధాకర్ పాల్గొన్నారు.