కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:18 PM
పదేళ్లు పరిపాలించిన బీఆర్‌ఎస్ పాలనను, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి వి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
దీక్షా దివ్‌సను విజయవంతం చేయాలి
పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్
మహబూబ్‌నగర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పదేళ్లు పరిపాలించిన బీఆర్‌ఎస్ పాలనను, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి వి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్య కార్యకర్తలు, నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలు, ఈనెల 29న నిర్వహించే దీక్షా దివ్‌సపై సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, మాటమార్చి హడావిడిగా ఎన్నికలకు వెళ్తోందని విమర్శించారు. ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీ చేసే చోట పార్టీ శ్రేణులు వారి గెలుపుకోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈనెల 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని కోరారు. ప్రతీ గ్రామం, వార్డు నుంచి నాయకులు, కార్యకర్తలు దీక్షాదివస్ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఇంతియాజ్ ఇసాక్, కోడ్గల్ యాదయ్య, బస్వరాజు గౌడ్, రాజేశ్వర్‌గౌడ్, ఆంజనేయులు, దేవేందర్‌రెడ్డి, బాలరాజు, చెన్నయ్య, కొండయ్య, శివరాజు, కృష్ణయ్యగౌడ్, రాఘవేందర్‌గౌడ్, బసిరెడ్డి, రాజుయాదవ్, అన్వర్ పాల్గొన్నారు.