అన్నదాతలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:02 PM
అన్నదాతలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తూ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో మద్దతు ధరకు వరిని కొనుగోలు చేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
- నారాయణపేట, మరికల్, ధన్వాడ మండలాల్లో మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నారాయణపేట/మరికల్/ ధన్వాడ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తూ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో మద్దతు ధరకు వరిని కొనుగోలు చేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. బుధ వారం నారాయణ పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రబీ సీజన్ వరి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి, మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన గ్రేడ్-ఏ క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చెల్లిస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, వైస్ చైర్మన్ కొనంగేరి హన్మంతు, మాజీ మార్కెట్ చైర్మన్ బండి వేణు గోపాల్, ఎండీ.సలీం, మల్లేష్, శరణప్ప, కుర్వ మనోజ్, మార్కెట్ కార్యదర్శి భారతి, సూపర్ వైజర్ లక్ష్మణ్, మునిసిపల్ కమిషనర్ భోగేశ్వర్లు తదితరులున్నారు.
అదేవిధంగా, మరికల్ మండలం తీలేరు సింగిల్ విండో కార్యాలయంలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వమే కొను గోలు చేస్తుందని, ధాన్యాన్ని తక్కువ ధరకు దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. రైతులకు టార్పాలిన్లు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రాజేందర్‌గౌడ్, సూర్యమోహన్‌రెడ్డి, వీరన్న, హరీశ్, రాజు, రామకృష్ణారెడ్డి, డైరెక్టర్లు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ధన్వాడ మండల కేంద్రంతో పాటు, మండ లంలోని మందిపల్లి, గున్ముక్ల, గోటూర్ గ్రామాల్లో వరి కోనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రారంభించారు. అనంతరం పలు రేషన్ షా పుల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సన్న బియ్యం అందించారు. ఎంనోన్‌పల్లి గ్రామంలోని రేషన్ లబ్ధిదారురాలు బోయ మణెమ్మ ఇంట్లో ఎమ్మెల్యే భోజనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
వీధి నాటకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ధన్వాడ మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లక్ష్మీ చెన్నకేశవ జీవిత చరిత్ర వీధి నాటకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాటకం చరిత్ర గురించి ఎమ్మెల్యేకు నిర్వాహకులు వివరించారు. ఐదురోజుల పాటు నాటకం కొనసాగుతుందన్నారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేతో పాటు, వ్యక్తిగత సహాయకుడు చిట్టెం మాధవరెడ్డి, మార్కెట్ యార్డు డైరెక్టర్లు నీరటి రాంచంద్రయ్య ముదిరాజ్, జట్రం లక్ష్మయ్యగౌడ్, చీరాల సుధాకర్‌రెడ్డిలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో రజక సం ఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, చాకలి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.