Share News

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దొందూ దొందే

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:20 PM

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ బీఆర్‌యస్‌ దొం దూ దొందేనని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు.

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దొందూ దొందే

- విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు

గద్వాల, జూలై 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ బీఆర్‌యస్‌ దొం దూ దొందేనని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు. సోమవారం డీకే బం గ్లాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్‌ డ్రామా చేస్తున్నదని ఆరోపించారు. తన తప్పును బీజేపీపై నెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నదని వి మర్శించారు. రిజర్వేషన్లను అమలు చేయకపో తే కాంగ్రెస్‌కు గడ్డుకాలం మొదలైనట్లేనని వివరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్లుగా పాలన చేసిన రిజర్వేషన్ల పేరిట బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని మోసం చేసిందని విమర్శించారు. అదేవిధంగా ముదిరాజ్‌లను బీసీ-ఏ జా బితాలో చేరుస్తామని, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చి మో సం చేసిందని వివరించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోవడంతోనే బీఆర్‌ఎస్‌కు వీళ్లు దూరం అయ్యారని ఎన్నికలలో ఓడియారని గు ర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి కూడా అంతేనని వివరించారు. బీసీలకు 42శా తం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి అ సెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపిందని వివరించారు. బీసీల సంఖ్యను తగ్గించి చూపెట్టడం అదేవిదంగా ముస్లింలను బీసీల కింద లెక్కగట్టి జనాభా చూపించడం వంటి తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి కేంద్రంపై, బీజేపీ పై వి మర్శలు చేస్తున్నదని వివరించారు. బిల్లుపై కేంద్రంతో ఎలాంటి చర్చలు చేయకుండా, కోర్టు మొట్టికాయలు కొట్టడంతో హడావిడి చేయడానికి రాష్ట్ర గవర్నర్‌ ద్వారా ఆర్డినెన్స్‌ తీసుకరావాలని చూస్తున్నదని వివరించారు. రాష్ట్రపతి ఆమోదంతోనే బీసీల రిజర్వేషన్లు పదిలంగా ఉంటాయన్న విషయం బీసీలందరికీ తెలుసున ని బీసీలంతా దీనిని గుర్తిస్తున్నారని అన్నారు. బీసీల రిజర్వేష్లన్లపై కాంగ్రెస్‌ చిత్తశుద్ధితో వ్యవహరించాలని, బీఆర్‌ఎస్‌ మాదిరిగా మోసం చేయాలని చూస్తే బీసీ ప్రజలు మీ తలరాతల ను తిరగరాస్తారని హెచ్చరించారు. సమావేశం లో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు బండల వెంకట్రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ ఎగ్బోటే, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, ఐటీ సెల్‌ అధ్యక్షుడు చిత్తారి కిరణ్‌, నాయకులు గాంజసాయి, రమేష్‌, సుధాకర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:20 PM