Share News

ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:32 PM

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు అ ధిక ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులకు ఆదేశించారు.

ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • ప్రజావాణిలో జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాలన్యూటౌన్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు అ ధిక ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులకు ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 72 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వ చ్చిన ఆర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, జిల్లా అధికారులు ఉన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 11:32 PM