ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - May 12 , 2025 | 11:19 PM
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చి, స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని స్థానికి సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు సంబంధిత ఆధికారులకు సూచించారు.
- అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చి, స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని స్థానికి సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు సంబంధిత ఆధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 96 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ అదనపు కలెక్టర్లతో పాటు సంబంధిత శాఖల అధికారులకు ఆర్జీలు సమర్పించుకున్నారు. ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, అర్బన్ తహసీల్దార్ ఘాన్సీరామ్ పాల్గొన్నారు