ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:33 PM
ప్రజా ఫిర్యా దులు తక్షణమే పరిష్కరించి, సివిల్ ఫిర్యాదులు కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ సూచిం చారు.
- పోలీసు ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణలో ఎస్పీ
నారాయణపేట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యా దులు తక్షణమే పరిష్కరించి, సివిల్ ఫిర్యాదులు కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ సూచిం చారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి దరఖాస్తులను ఆయన స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురి ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుదారులు మధ్యవర్తులను పోలీస్‌స్టేషన్‌లకు, ప్రధా న కార్యాలయాలకు తీసుకెళ్లరాదని, ధైర్యంగా వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు.
క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు
ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడు స్తున్నందున చాలామంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పతున్నారని, దీనివల్ల యువత బెట్టింగ్స్‌తో డబ్బులు నష్టపోయి జీవితాలు నాశ నం చేసుకోవద్డని ఎస్పీ యోగేష్‌గౌతమ్ సూ చించారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహిం చినా చట్టప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉం చాలని ఆయన కోరారు.