Share News

ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:25 PM

ప్రజావాణి ఫిర్యాదులు సత్వర మే పరిష్కరించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి ఫిర్యాదులు సత్వర మే పరిష్కరించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 86 ఫిర్యాదులు రాగా కలెక్టర్‌ స్వీక రించి, మాట్లాడారు. ఆర్టీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, ఆర్డీవో నవీన్‌, డీఆర్డీవో నర్సింహులు పాల్గొన్నారు.

కమీషన్‌ డబ్బులు విడుదల చేయాలి..

జిల్లాలోని రేషన్‌ డీలర్లకు ఏప్రిల్‌ 2024కు సంబంధించిన కమీషన్‌ విడుదల చేయాలని జి ల్లా చౌకధర దుకాణాదారుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్యాసుందర్‌యాదవ్‌, జానకిరాములు, అన్వర్‌పాష ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

నష్టపరిహారం ఇవ్వాలి..

ఎనుగొండ బైపాస్‌ రోడ్డులో సర్వే నెం.19లో గల రిజిస్ట్రర్‌ ప్లాట్లు కోల్పోయిన వారికి జనరల్‌ అవార్డు కింద నష్ట పరిమారం ఇవ్వాలని కోరు తూ బాఽధితులు ప్ర జావాణిలో ఫిర్యాదు చేశారు. 17 ప్లాట్లు కో ల్పోయినట్లు వినతిలో పేర్కొన్నారు. భగవం త్‌రెడ్డి, ధామోదర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రివణ్‌కుమార్‌ తదితరులు వినతి పత్రం అందజేశారు.

కలెక్టరేట్‌లో మట్టి వినాయకుల పంపిణీ

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో వినాయక చవితి చవితి సంద ర్భంగా సోమవారం కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులకు, ఉద్యోగులకు మట్టి వినాయకుల ను పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్ల పని చేయడం లేదని, పారితోషికాలు తగ్గించాలనే వ్యతిరేక వి ధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్రం పెం చిన పారితోషికాల చెల్లింపు, ఫిక్స్‌డ్‌ వేతనం రూ. 18వేలు పరిష్కరించానలి ఫిర్యాదులో పేర్కొన్నా రు. రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, సీఐటీయూ జి ల్లా అధ్యక్షుడు దీప్లనాయక్‌, కార్యదర్శి కురుమూ ర్తి, రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్‌ ఉన్నారు.

సర్టిఫికెట్ల ప్రదానం

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం, హాస్పి టల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా స్వయం సహాయక బేకరిలో శిక్షణ పొందిన మహిళలకు సోమవా రం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ విజయేందిర బోయి స ర్టిఫికెట్లు అందజేశారు. బిస్కెట్‌లు, కేకులు తది తర 16 రకాల వాటిలో శిక్షణ పొందారు. ఈ సందర్భంగా వారు తయారు చేసిన కేక్‌ను కలె క్టర్‌ కట్‌ చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అదనపు పీడీ శారద, డీపీఎం రాములు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:25 PM